ఛీట్టీల పేరిట ఘోర మోసం!

02-11-2026 | 11:12pm

కష్టపడి దాచుకున్న కోటీన్నర సొమ్ముకు ఎసరు!

చేర్యాల, నవంబర్ 02 : ఆడపిల్లల పెళ్లిళ్లు(Marriages of girls), ఇళ్ల నిర్మాణాలు(House construction), పిల్లల చదువుల(Children's education) కోసం ఒక్కో రూపాయి చొప్పున కూడబెట్టుకున్న కష్టార్జితాన్ని నమ్మి ఒకే వ్యక్తి చేతిలో పెడితే చివరికి అదే ఉరితాడుగా మారింది. చిట్టీల పేరిట సాగిన ఈ ఘరాన మోసం చేర్యాల పట్టణ శివారు బీడీ కాలనీలో వెలుగు చూసింది.బీడీ కాలనీలోని నిరుపేదలు, కూలీలు, వితంతువులు అష్టకష్టాలు పడి కూడబెట్టిన సొమ్మును భద్రపరుచుకోవడానికి చిట్టీల మార్గాన్ని ఎంచుకున్నారు.

ఇదే అదునుగా భావించిన మహ్మద్ అజీజ్ అహ్మద్ గత కొన్ని సంవత్సరాలుగా అక్కడ చిట్టీల వ్యాపారాన్ని సాగిస్తూ వచ్చాడు. కాలనీ ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నమ్మకం కల్పించి క్రమం తప్పకుండా డబ్బులు వసూలు చేశాడు.ప్రారంభంలో అంతా సక్రమంగానే నడిచినా, తెరవెనుక కుట్ర సాగుతూనే ఉంది.కొన్ని నెలలుగా డబ్బులు అడుగుతుంటే 'రేపు, మాపు' అంటూ కాలయాపన చేశాడు.తాను ఎవరికీ బాకీ లేనంటూ కోర్టును ఆశ్రయించి 'ఐపీ' (దివాళా పిటిషన్) నోటీసులు తెప్పించాడు.

మొత్తం 50 మందిలో కేవలం 28 మందికి మాత్రమే ఐపీ నోటీసులు పంపి, మిగిలిన వారితో సెటిల్మెంట్లు చేసుకునేందుకు యత్నిస్తున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు.నిర్వాహకుడి మోసాన్ని సహించలేకపోయిన కాలనీవాసులు ఆయన ఇంటి ముందు బైఠాయించి తీవ్ర నిరసన తెలిపారు.దోచుకున్న ప్రతి రూపాయిని తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో అమరణ నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.న్యాయపోరాటం కోసం బాధితులు స్థానిక పోలీసులతో పాటు జిల్లా కేంద్రంలోని సీపీ కార్యాలయానికి తరలివెళ్లారు. పేదల పొట్ట కొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నారు.

మరిన్ని వార్తలు