డా. విజయకుమార్ కు జీవిత సాఫల్య పురస్కారం

21-09-2026 | 03:01pm

సిద్దిపేట (విజయక్రాంతి): ఆయుర్వేద వైద్య రంగంలో విశేష కృషి చేసిన ఆయుర్వేద వైద్యులు (Ayurvedic doctors) డాక్టర్ .విజయ్ కుమార్ మంతవార్ కు జీవిత సాఫల్య పురస్కారం లభించింది. హైదరాబాదులోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం నందమూరి తారక రామారావు కళాభవన్ లో(University Nandamuri Taraka Rama Rao Kala Bhavan) ఈ పురస్కారం పొందారు. తెలంగాణ భాషా,కళలు, సాంస్కృతిక విభాగం సహా భాగస్వామ్యంతో మక్స్ గ్లోబల్ ఫౌండేషన్ సంస్థల ఆధ్వర్యంలో దక్షిణ భారత అవార్డ్స్ సీజన్ 5, 2026తోపాటు సన్మాన సత్కారంతో గౌరవించారు. ఆయుర్వేద వైద్యము, దాని విశిష్టతల గురించీ విశేష కృషికి  గుర్తింపుకుగా అవార్డ్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ రహమాన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కాల్వ సుజాత, మక్స్ నిర్వహనాధికారి దినేష్ చెరిపల్లి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు