కాల్వ సుజాతకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని ఇవ్వాలి
06-11-2026 | 07:13pm
వట్టిపల్లి రాజిరెడ్డి తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శి.
సిద్దిపేట, (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ(Congress Party) అధికారంలో లేని సమయంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) కావాలనే లక్ష్యంతో పని చేసిన మన నాయకురాలు, సామాజిక సేవాకురాలు కాల్వ సుజాతకు(Kalva Sujatha) గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి(MLC position) కేటాయించాలని తెలంగాణ రెడ్డి సంఘం రాష్ట్ర కార్యదర్శి వట్టిపల్లి రాజిరెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వనికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఆమె పోరాట త్యాగాలు గుర్తించి ఆమెకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.