స్టార్ బ్యాటర్ మిస్సింగ్.. కివీస్‌కు షాక్
టీమిండియాతో పోరుకు ముందే కివీస్‌కు బిగ్ షాక్.. స్టార్ ప్లేయర్ ఔట్!
భారత్‌తో జరుగుతున్న ODI Seriesలో న్యూజిలాండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్ డెవాన్ కాన్వే(Devon Conway Out) మిగిలిన వన్డేలకు దూరమయ్యాడు. ప్రాక్టీస్ సమయంలో తలకు గాయం కావడంతో అతడిని జట్టు నుంచి తప్పించినట్లు New Zealand Cricket ప్రకటించింది. మొదటి వన్డేకు ముందు మంగళవారం జరిగిన Training Sessionలో కాన్వేకు గాయమైంది. దీంతో అతడిని ఆక్లాండ్‌లోని ఓ ఆసుపత్రి Accident and Emergency విభాగానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్యుల పరిశీలనలో Concussion సమస్య ఉన్నట్లు తేలడంతో మిగిలిన మ్యాచ్‌లకు అందుబాటులో ఉండడని స్పష్టం చేశారు.
కాన్వే స్థానంలో ఎడమచేతి వాటం బ్యాటర్ నిక్ కెల్లీ జట్టులోకి రానున్నాడు. ఇప్పటికే నాలుగో, ఐదో వన్డేల కోసం ప్రకటించిన జట్టులో ఉన్న కెల్లీ.. శుక్రవారం వెల్లింగ్టన్లో జట్టుతో కలవనున్నాడు. శనివారం జరిగే రెండో ODIలో కాన్వే స్థానంలో ఆడే అవకాశం ఉంది. భారత్‌తో కీలకమైన సిరీస్‌లో కాన్వే దూరం కావడం కివీస్ బ్యాటింగ్ లైనప్‌కు గట్టి దెబ్బగా మారింది. అతడి స్థానంలో నిక్ కెల్లీ ఎలా రాణిస్తాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.