2028లో తెలంగాణ సీఎం బీసీ

06-11-2026 | 05:00am

టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): టీఆర్పీ అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న(TRP President Teenmar Mallanna) చేపట్టిన బీసీ రాజ్యాధికార యాత్ర 43వ రోజు గురువారం యాదాద్రి జిల్లా నారాయణపురం చేరుకున్నారు. నారాయణపూర్ సెంటర్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో మల్లన్న ప్రసంగించారు. 2028లో తెలంగాణ సీఎం బీసీయే అని జోస్యం చెప్పారు. మునుగోడు నియోజకవర్గం తెలంగాణలోనే అత్యంత పేద ప్రజలు ఉన్న ప్రాంతమని, కానీ ఇక్కడి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి మాత్రం మాత్రం రాష్ర్టంలోనే అత్యంత ధనికుడని మల్లన్న ఎద్దేవా చేశారు.

నియోజకవర్గంలోని ఓట్ల లెక్కలను వివరిస్తూ మొత్తం ఓట్లు 2,52,699 ఉంటే ,రెడ్డి సామాజికవర్గం ఓట్లు కేవలం 18,043 మాత్రమే అని, బీసీల ఓట్లు ఏకంగా 1,37,000 ఉన్నాయని అన్నారు. లక్షకు పైగా ఓట్ల మెజారిటీ ఉన్న బీసీలు ఇప్పటివరకు మునుగోడులో ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కాకపోవడం శోచనీయమన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీ అభ్యర్థి పాలకూరి అశోక్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొమిరశెట్టి నరసింహులు, టీఆర్పీ ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి మదన్మోహన్ చారి, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంగారపు నరసయ్య గౌడ్, రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్‌రాజ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు