ఓటములను జీర్ణించుకోలేక వ్యవస్థలపై విషం

06-11-2026 | 05:25am
  1. కాంగ్రెస్ తీరు ప్రజాస్వామ్యానికే కళంకం 
  2. తెలంగాణలో ప్రభుత్వ వైఫల్యాలపై ఉద్యమాలు ఉధృతం 
  3. 2028లో రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం
  4. కేసీఆర్ రాజకీయంగా ఓ ఐరన్‌లెగ్!
  5. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్ 

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ఎన్నికల్లో ప్రజామోదంతో గెలవలేక, వరుస ఓటములను జీర్ణించుకోలేక కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ దేశ ప్రజాస్వామ్య వ్యవ స్థల విశ్వసనీయతపైనే విషం చిమ్ముతున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్ మాధవ్(BJP National Vice President Ram Madhav) మండిపడ్డారు.

కొన్ని నెలలుగా ఈవీఎంలు, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఓట్ల చోరీ జరిగిందని నిరాధారమైన ఆరోపణలతో వ్యవస్థలను కించపరుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ నాయకత్వంలో ప్రజల దీవెనలతో బీజేపీ గెలిస్తే.. తప్పుడు మార్గంలో నెగ్గినట్లు కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రజాస్వామ్యాన్ని హత్య చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని వ్యాఖ్యానించారు.

1975లో ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టు తీర్పునిస్తే, ఆమె రాజీనామా చేయకుండా దేశంలో ఎమర్జెన్సీ విధించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని విమర్శించారు. 1987లో రాజీవ్‌గాంధీ ప్రభుత్వం జమ్మూకశ్మీర్‌లో ఫరూక్ అబ్దుల్లాతో కలిసి ఎన్నికల్లో అవకత వకలకు పాల్పడటం వల్లే అక్కడ తీవ్రవాదం పెచ్చరిల్లిందని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో విధానపరమైన చర్చలకు ఆహ్వానిస్తే హాజరుకాకుండా విదేశాలకు వెళ్లిపోయే రాహుల్ గాంధీ, రోడ్లపై నిలబడి రాజకీయాలు చేయడం సిగ్గుచేటని రామ్ మాధవ్ ఎద్దేవా చేశారు. 

స్థానిక సంస్థల్లోనూ.. 

సర్ ప్రక్రియపై కాంగ్రెస్ పనిగట్టుకుని అవాస్తవాలను ప్రచారం చేస్తోందని రామ్ మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో 1952 నుంచి ఇప్పటివరకు 11సార్లు ఎస్‌ఐఆర్ చేపట్టారని, చివరిసారిగా 2004లో జరిగిందని తెలిపారు. మర ణించినవారు, నకిలీ ఓటర్లు, అక్రమ వలసదారుల పేర్లను తొలగించడం ఎన్నికల సంఘం బాధ్యత అని పేర్కొన్నారు. గతంలో కేంద్ర హోం మంత్రిగా పనిచేసిన ఇంద్రజిత్ గుప్తానే స్వయం గా దేశంలో కోటి 20 లక్షల మంది అక్రమ చొరబాటుదారులు ఉన్నారని పార్లమెంట్‌లో వెల్లడిం చినట్లు గుర్తు చేశారు.

అలాంటి అక్రమ ఓట్లను కాపాడుకుని రాజకీయ లబ్ధి పొందడమే కాంగ్రె స్ ఉద్దేశమని, అందుకే సర్ ప్రక్రియపై అనవసర గగ్గోలు పెడుతోందని దుయ్యబట్టారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన అసోంలోని సిల్చార్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 42 స్థానాల్లో బీజేపీ 34 గెలుచుకుందని, కాంగ్రెస్ కేవలం 2 స్థానాలకే పరిమితమైందని తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లో బ్యాలెట్ విధానంలో జరిగిన 28 ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ 16 గెలిస్తే, కాంగ్రెస్ ఒక్కటే గెలిచిందని, ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేదని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో 23 పార్టీలు కలిసి సభ పెడితే కనీసం 50 వేల మందిని కూడా సమీకరించలేక కుర్చీలు ఖాళీగా కనిపించాయని విమర్శించారు.

కేసీఆర్ ఐరన్‌లెగ్.. 

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ప్రజావ్యతిరేక విధానాలు, అవినీతి, తప్పుడు ప్రచారాలను క్షేత్రస్థాయిలో ఎండగడతామని రామ్ మాధవ్ స్పష్టం చేశారు. ఇటీవల భాగ్యనగరంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు నేతృత్వంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్న పాదయాత్రకు, నిర్మల్ మహాపాదయాత్రకు వేలాదిగా ప్రజలు తరలివచ్చి మద్దతు ప్రక టించారని తెలిపారు. 1990 నుంచే సుష్మా స్వరాజ్ నాయకత్వంలో తెలంగాణ ఏర్పాటు కోసం పోరాడి తీర్మానం చేసిన ఘనత బీజేపీదన్నారు.

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకుంటున్న పార్టీ అధినేత.. రాజకీయంగా ఐరన్ లెగ్‌గా మారారని కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో దేశమంతా తిరిగి థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తానంటూ ఎవరినైతే కలిశారో -బెంగాల్‌లో మమతా బెనర్జీ, ఒడిషాలో నవీన్ పట్నా యక్, చివరకు ఏపీలో జగన్‌మోహన్ రెడ్డి ఓట మి చవిచూశారని, ఆ జాబితాలో చివరకు ఆయ న కూడా అధికారం కోల్పోయి ప్రజల చేతిలో చతికిల పడ్డారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్ర త్యామ్నాయం బీజేపీయేనని,  2028లో తెలంగాణలో అధికారంలోకి వస్తామని ఆయన దీమా వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు