డిసెంబర్ నుంచి బరాజ్‌ల రిపేరు!

06-11-2026 | 05:30am
  1. నిపుణుల సూచనల మేరకే పునరుద్ధరణ 
  2. వచ్చే నెలలో పనులు ప్రారంభానికి ఏర్పాట్లు 
  3. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశం 
  4. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల మరమ్మతులపై సమీక్ష
  5. మూడు బరాజ్‌ల రిపేర్లకు రూ.4,193 కోట్ల వ్యయం?

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ సంస్థలు, డ్యామ్ సేఫ్టీ నిపుణుల సూచనల ప్రకారమే కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. ఈ మూడు బరాజ్‌ల మరమ్మతులకు అవసరమైన చర్యలపై మంత్రులు, నీటిపారుదల శాఖ అధికారులతో సీఎం గురువారం సమీక్ష నిర్వహించారు. గత ప్రభు త్వం చేసిన తప్పులు పునరావృతం కాకుండా ప్రాజెక్టును కాపాడాల్సిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మేడిగడ్డ వద్ద నీళ్లున్నా వాటిని లిఫ్ట్ చేయడం లేద నే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని మం త్రులకు సూచించారు.

అక్కడ కనిపించే నీటి ని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సాంకేతికంగా లిఫ్ట్ చేయడం సాధ్యం కాదని ఇంజనీర్లు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసిన నీళ్లు ఎల్లంపల్లికి చేరాలంటే అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల గేట్లను మూసివేయాల్సి ఉంటుందని పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. నిర్మాణ లోపాలున్న ఈ బరాజ్‌ల గేట్లను తెరిచే ఉంచాలని ఎన్డీఎస్‌ఏ హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. దిగువ గోదావరి నీరు వృథాగా పోకుండా దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకాల ద్వారా గతంలో ఎన్నడూ లేనివిధంగా నీటిని లిఫ్ట్ చేసినట్లు సీఎం రేవంత్ వెల్లడించారు.

దీంతో ఉమ్మడి వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల ఆయకట్టుకు సాగు, తాగునీటిని అందించామని తె లిపారు.  గత ప్రభుత్వ హయాంలో దేవాదుల ద్వారా ఏడాదికి సగటున 9.57 టీఎం సీల నీటిని లిఫ్ట్ చేస్తే, ఈ మూడేండ్లలో సగటున 18.13 టీఎంసీల నీటిని లిఫ్ట్ చేసినట్లు చెప్పారు. గతంతో పోలిస్తే 89 శాతం అధికంగా గోదావరి నీటిని వాడుకున్నట్లు వివ రించారు. అక్టోబర్ నాటికి దేవాదుల ద్వారా 16.71 టీఎంసీలు, సీతారామ ద్వారా 8.10 టీఎంసీలు లిఫ్ట్ చేసి 24.81 టీఎంసీల గోదావరి జలాలను సద్వినియోగం చేసుకున్నామని వివరించారు.

ఈ సమావేశంలో మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు రూపొందించిన ప్రణాళికను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ అధికారులు వివరించారు. గత ప్రభుత్వం చేసిన తప్పుల కారణం గానే మేడిగడ్డ కుంగిపోయిందని, బరాజ్‌ల కుంగుబాటుకు దారితీసిన కారణాలను వెల్లడించారు. తుమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మిం చి ప్రాణహిత ప్రాజెక్టును పూర్తి చేసి ఉంటే నేడు కరువు ఇబ్బందులు ఉండేవి కావని, ప్రాణహిత నీటిని తక్కువ ఖర్చుతో ఎల్లంపల్లికి తీసుకువచ్చే అవకాశం ఉండేదన్నారు.

బరాజ్‌ల భద్రతపై రాజీ పడొద్దు.. 

మూడు బరాజ్‌ల పునరుద్ధరణకు అత్యం త ప్రాధాన్యం ఇవ్వాలని, పనులను వేగవం తం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. బరాజ్‌ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఎన్‌డీఎస్‌ఏ మార్గదర్శకాలకు అనుగుణంగా పనులు చేపట్టాలని చెప్పారు. అవసరమైన అనుమతులను త్వరితగతిన పొందేందుకు కేంద్ర ప్రభు త్వ సంస్థలతో సమన్వయం చేసుకోవాలని తెలిపారు. మూడు బరాజ్‌ల పరిస్థితిపై జాతీ య స్థాయి నిపుణులు, కేంద్ర ప్రభుత్వ సాం కేతిక సంస్థల సహకారంతో అవసరమైన పరిశోధనలు పూర్తి చేసినట్లు తెలిపారు. పునరుద్ధరణకు సంబంధించిన ప్రాథమిక ప్రణాళికలకు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఇప్పటికే సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని వివరించారు.

మూడు బరాజ్‌ల పునరుద్ధరణ పనులకు దాదాపు రూ.4,193 కోట్ల అంచనాతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు సీఎంకు అధికారులు తెలిపారు. నిర్మాణ లోపాలకు సంబంధించిన మరమ్మతుల వ్యయాన్ని నిర్మా ణ సంస్థలే భరించేలా, అదనపు పనుల వ్యయా న్ని ప్రభుత్వం భరించేలా ప్రతిపాదించినట్లు చెప్పారు. పనుల్లో జాప్యం జరగకుండా అన్ని ప్రక్రియలను సమాంతరంగా కొనసాగించాలని అధికారులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి సూచించారు. పునరుద్ధరణ పనుల కు సంబంధించిన తుది అనుమతులను ఈ నెలాఖరు లోగా పొందేందుకు ప్రయత్నించాలని సీఎం ఆదేశించారు.

ఈ ఏడాది చివరిలోగా పనులు ప్రారంభించాలన్నారు. బరాజ్‌ల నీటి వినియోగ సామర్థ్యాన్ని పునరుద్ధరించే పనులతో పాటు రక్షణ పనులను రెం డు దశలుగా విభజించుకోవాలని చెప్పారు. బరాజ్‌ల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు, నిర్మాణ సంస్థల మధ్య సమన్వయం ఉండాలని స్పష్టం చేశారు. సమావేశంలో నీటిపారు దల శాఖ కార్యదర్శి శ్రీధర్, టన్నెల్స్ అండ్ సేఫ్టీ కార్యదర్శి కల్నల్ పరీక్షిత్ మెహ్రా, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు