అయ్యప్ప సొసైటీ నిర్మాణాల్లో అక్రమాలు
- హైకోర్టు ఉత్తర్వులను కాదని అడ్డగోలుగా పర్మిషన్లు
- ఈ దందాలో సీఎం సోదరుల హస్తం
- కాంగ్రెస్ పాలనలో ౭౦౦ వరకు అక్రమ భవనాలు
- తెలంగాణ రక్షణ సేన చీఫ్ కవిత
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని అయ్యప్ప సొసైటీని చెరబట్టారని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) ఆరోపించారు. గ్రౌండ్ వాటర్ లేని ఆ ప్రాంతంలో ఒక్క ఇటుక కూడా పేర్చవద్దనే హైకోర్టు ఉత్తర్వులను కాదని అక్రమాలకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.
సరైన రోడ్లు, నీళ్లు లేక హైదరాబాద్ ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను పట్టించుకోకుం డా సీఎం, ఆయన కుటుంబ సభ్యులు అక్రమ సంపాదనపైనే దృష్టి పెట్టారని అన్నారు. గురువారం బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అయ్యప్ప సొసైటీలో ని గురుకుల ట్రస్టీ భూముల్లో అక్రమంగా 500 నుంచి 700 వరకు నిర్మాణాలు వెలిశాయని పేర్కొన్నారు. వాటన్నింటికీ
సీఎం సోదరులే కమీషన్లు దండుకుని పర్మిషన్లు ఇప్పించారని ఆరోపిం చారు. తాజాగా మరో 80 భవనాలు నిర్మాణంలో ఉన్నాయన్నారు. ఈ భూముల్లో రిజిస్ట్రేషన్‌కు అవకాశం లేకపోవటంతో నోటరీల ద్వారా చేయిస్తున్నా రని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతుంటే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఎవరి ఒత్తిడి కారణంగా ఈ అక్రమాలను చూసి చూడనట్లు వదిలేస్తున్నారంటూ నిలదీశారు. మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న ముఖ్యమంత్రే పెద్ద పెద్ద బిల్డర్లకు సహకరిస్తున్నారని ఆరోపించారు.
మూసీ గర్భంలో నిర్మాణాలు చేపట్టిన ఆదిత్య బిల్డర్స్‌కు అదే మూసీలో మరో మూడు ప్రాజెక్ట్ లు చేపట్టిన పట్టించుకోవటం లేదన్నారు. ఆదిత్య బిల్డర్స్ వాళ్లు సీఎం ఇద్దరు సోదరులకు చెరొక విల్లా ఇవ్వటంతోనే వారికి పర్మిషన్లు ఇచ్చారన్నారు. ఈ విధంగా అడ్డదిడ్డంగా దోచుకుంటున్న వారిని ప్రకృతి కూడా క్షమించదని హెచ్చరించారు. అయ్యప్ప సొసైటీలో భూములు, ఫ్లాట్లు కొనవద్దని ప్రజలకు కవిత సూచించారు. నెలరోజుల్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, లేదంటే ఆ తర్వాత తామే వాటికి రెడ్ మార్కింగ్ చేస్తామని హెచ్చరించారు.
రాష్ట్రంలో ఆర్టీఐ ఉండి ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. మొత్తంగా 18 వేల అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కాంగ్రెస్ ఢిల్లీలో ధర్నా చేస్తే అమిత్ షా హైదరాబాద్ వచ్చికౌంటర్ రాజకీయాలు చేశారే తప్ప తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. పైగా జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుస్తామం టూ బీరాలు పోవడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.
నగరానికి ఏమీ చేయని బీజేపీ నాయకులు నీళ్లు లేని బావిలో దూకాలని సూచించారు. దేశంలో 13 కోట్ల మంది విదేశీయులున్నారంటున్న అమిత్ షా, బీజేపీ రెండు సార్లు వాళ్ల ఓట్లతోనే గెలిచిందా చెప్పాలని కవిత డిమాండ్ చేశారు. తన వద్ద ఇంచు అసైన్డ్, ఇనాం భూములు ఉన్న సరే ప్రభుత్వానికే రాసిస్తా అని ప్రకటించారు. రాష్ట్రంలో ప్రజలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నారని, దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. రానున్న గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మహిళలు ఓటు నమోదు చేసుకోని తమకు అండగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.