కివీస్ సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం

28-09-2026 | 01:12pm

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా(Hardik Pandya injury) రీఎంట్రీకి మరోసారి గాయం అడ్డంకిగా మారింది. పోటీ క్రికెట్‌లోకి తిరిగి రావడానికి సిద్ధమవుతున్న సమయంలో ఆయన కుడి కాలి షిన్ ప్రాంతంలో సమస్య తలెత్తింది. తాజా వైద్య పరీక్షల్లో right tibial bone stress response ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎముకకు ఫ్రాక్చర్ లేదా ఇతర structural damage లేదని వైద్య బృందం స్పష్టం చేసింది.

పాండ్యాను ముందుగా ఆస్ట్రేలియా-Aతో(Australia-A) జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు ఎంపిక చేశారు. అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో పుదుచ్చేరిలో ఈ మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే ఫిట్‌నెస్ క్లియరెన్స్‌కు ముందే కొత్త గాయం రావడంతో ఆయన ఈ సిరీస్‌కు దూరమయ్యారు. వైద్య బృందం ప్రస్తుతం రెండు వారాల పూర్తి విశ్రాంతి సూచించింది. ఈ తరహా tibial bone stress సమస్యలకు పూర్తిగా కోలుకోవడానికి సాధారణంగా నాలుగు నుంచి ఆరు వారాల వరకు సమయం పట్టొచ్చని వైద్య నివేదికలను ఉటంకిస్తూ క్రికెట్ మీడియా పేర్కొంది. అయితే హార్దిక్ తిరిగి మైదానంలోకి వచ్చే ఖచ్చితమైన సమయం ఆయన రికవరీపై ఆధారపడి ఉంటుంది.

దీంతో న్యూజిలాండ్(IND vs NZ 2026) పర్యటనలో హార్దిక్ అందుబాటులో ఉంటారా? అనే ప్రశ్న కూడా మొదలైంది. భారత్-న్యూజిలాండ్ టీ20 సిరీస్ అక్టోబర్ 22 నుంచి ప్రారంభం కానుంది. తాజా పరిస్థితుల్లో ఆయన రీఎంట్రీపై స్పష్టత రావాలంటే మరిన్ని ఫిట్‌నెస్ అంచనాలు అవసరం. హార్దిక్ చివరిసారిగా IPL 2026లో పోటీ మ్యాచ్ ఆడారు. ఆ తర్వాత రిహాబిలిటేషన్‌లో ఉండగా వరుసగా ఫిట్‌నెస్ సమస్యలు ఎదురయ్యాయి. దీంతో ఆయన కమ్‌బ్యాక్‌పై మరోసారి ఉత్కంఠ నెలకొంది.

మరిన్ని వార్తలు