బ్రెడ్, జామ్ తింటున్నారా..జాగ్రత్త!
28-09-2026 | 12:50pm
కేరళలోని త్రిశూర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. బ్రెడ్(Bread), జామ్(jam) తిన్న 60 ఏళ్ల వినోద్ కుమార్ మృతి చెందగా.. ఆయన ఇద్దరు కుమార్తెలు అస్వస్థతకు గురయ్యారు. ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే ముగ్గురికి వాంతులు, అనారోగ్య లక్షణాలు కనిపించాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వినోద్ ఆదివారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆహారం కలుషితం కావడం వల్లే ఘటన జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానిస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక తర్వాతే మృతికి కారణం స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.