ఖేలో ఇండియా గేమ్స్‌కు పటిష్ట వైద్య ఏర్పాట్లు
హైదరాబాద్, నవంబర్ 27: డిసెంబర్ 11 నుంచి తెలంగాణ వేదికగా జరగనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్(Khelo India Youth Games) కోసం ఏర్పా ట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ గేమ్స్ కోసం తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్యశాఖ పటిష్టమైన వైద్య ఏర్పాట్లను చేస్తోంది. క్రీడాకా రులు, అధికారులు, సందర్శకులకు నిరంతర వైద్య సేవలు అందించేందుకు అన్ని వేదికలు, వసతి కేంద్రాల్లో సమగ్ర వైద్య, అత్య వసర సేవలను ఏర్పాటు చేయనుంది. తెలంగాణలోని 8 జిల్లాల్లో 20 క్రీడా వేదికలపై 29 క్రీడా విభాగాల్లో జరగనున్న ఈ క్రీడల కోసం బహుళస్థాయి వైద్య వ్యవస్థను సిద్ధం చేశారు.
అత్యవసర పరిస్థితుల్లో తక్షణ వైద్య సహాయం అందించడంతో పాటు, అవసరమైన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించేలా ఏర్పాట్లు చేశారు. క్రీడా మైదానాల్లో క్రీడాకారులకు నిపుణుల వైద్య సహాయం అందించేందుకు మొత్తం 278 స్పెషలిస్ట్ వైద్య బృందాలను ఏర్పాటు చేశారు. గా యాలు, ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చికిత్స అందించేందుకు సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు అందుబాటులో ఉంటారు.