ఫైనల్లో సబలెంకా, రిబకినా
సెమీస్‌లో పెగులాపై సబలెంకా విజయం
నాలుగోసారి ఫైనల్లోకి ఎంట్రీ
గాఫ్ కు షాకిచ్చిన రిబకినా
న్యూయార్క్, సెప్టెంబర్ 11: యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ విభాగంలో బెలారస్ స్టార్ అరీనా సబలెంకా(Aryna Sabalenka) ఫైనల్‌కు దూసుకెళ్లింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో సబలెంకా 7 6 అమెరికాకు చెందిన జెస్సికా పెగులాపై సునాయాస విజయాన్ని అందుకుంది. కేవలం రెండు సెట్లలోనే ప్రత్యర్థిని చిత్తు చేసిన సబలెంకా నాలుగోసారి యూఎస్ ఓపెన్ ఫైనల్లో అ డుగుపెట్టింది. ఇప్పటికే 2024, 2025 యూఎస్ ఓపెన్ టైటిల్స్ నెగ్గిన సబలెంకా హ్యాట్రిక్‌పై కన్నేసింది.
అంతేకాదు హార్డోకోర్ట్‌పై వరుసగా మూడో టైటిల్ అందుకునేందుకు సబలెంకా అడుగు దూ రంలో నిలిచింది. గతంలో రెండుసార్లు (2024, 2025 యూఎస్ ఓపెన్) ఫైనల్లో పెగులాను ఓ డించి టైటిల్ అందుకున్న సబలెంకా ఈసారి పెగులాను సెమీస్‌లోనే చిత్తు చేసింది. మరోవైపు తా జా వరల్డ్ నెంబర్ వన్ రిబకినా కూడా ఫైనల్లో అ డుగుపెట్టింది. అమెరికా స్టార్ కోకో గాఫ్‌కు ఎలీ నా రిబకినా షాకిచ్చింది. తొలి సెట్ కోల్పోయినప్పటికీ అద్భుతంగా పుంజుకున్న రిబకినా.. వరుస గా రెండు సెట్లు గెలిచి మ్యాచ్ సొంతం చేసుకుంది.
తొలి సెట్‌లో గాఫ్ ఆధిపత్యం ప్రదర్శించి 6- సొంతం చేసుకుంది. అయితే రెండో సెట్ లో రిబకినా తన అద్భుతంగా పుంజుకుంది. ఆరంభంలోనే గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసి 3- ఆధి క్యంలోకి వెళ్లింది. గాఫ్ తిరిగి పుంజుకుని స్కోరును 4- సమం చేసినా.. కీలక సమయంలో డబు ల్ ఫాల్ట్ చేయడంతో రిబకినాకు రెండు సెట్ పా యింట్లు లభించాయి. ఆ అవకాశాన్ని సద్వినియో గం చేసుకున్న రిబకినా 6- రెండో సెట్‌ను గెలిచి మ్యాచ్‌ను నిర్ణయాత్మక మూడో సెట్‌కు తీసుకెళ్లింది. డిసైడింగ్ సెట్‌లోనూ ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు సాగింది.
గాఫ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన రిబకినా పైచేయి సాధించింది. కీలక సమయంలో గాఫ్ సర్వీస్‌ను మళ్లీ బ్రేక్ చేసి మ్యాచ్‌ను ముగించింది. చివరకు మూడో సెట్‌ను కూడా 6 గెలుచుకుని ఫైనల్లో అడుగుపెట్టింది. ఫైన ల్లో ఎలీనా రిబకినా.. డిఫెండింగ్ చాంపియన్ అరీ నా సబలెంకాతో తలపడనుంది. ఇప్పటికే సెమీఫైనల్‌కు రిబకినా ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును సొంతం చేసుకున్న ఆమె ఇపుడు టైటిల్ పైనా క న్నేసింది. మరోవైపు వరుసగా రెండుసార్లు యూఎస్ ఓపెన్ టైటిల్ గెలిచిన సబలెంకా.. హ్యాట్రిక్‌పై కన్నేసింది. దీంతో రిబకినా- సబలెంకా ఫైనల్ పోరు ఆసక్తికరంగా మారింది.