ఆసియా కప్ ఫైనల్లో శ్రీలంక
సెమీస్‌లో పాక్‌పై గెలుపు
భారత్‌తో టైటిల్ పోరు
దుబాయి, సెప్టెంబర్ 11: మహిళల ఆసియా కప్(Women's Asia Cup)లో శ్రీలంక ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఉత్కంఠ భరితంగా సాగిన రెండో సెమీ ఫైనల్లో లంక 4 వికెట్ల తేడాతో పాక్ ను ఓ డించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 130 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్ ఫాతిమా సనా ఓ మోస్తరు ఇన్నింగ్స్ (47 నాటౌట్) ఆడటంతో పాక్ ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. శ్రీలంక బౌలర్లలో కెప్టెన్ చమారీ ఆటపట్టు, చముడి ప్రబోదా తలో 2 వికెట్లు తీయగా.. సుగందిక కుమారి ఓ వికెట్ పడగొట్టింది.
చేజింగ్‌లో శ్రీలంకకు ఆదిలోనే షాక్ తగిలింది. కేవలం 7 పరుగులకు 2 వికెట్లు కోల్పోయింది. అయితే హర్షిత(36), కవిశ(33) కీలక భాగస్వామ్యం లంక విజయంలో కీలక పాత్ర పోషించింది. వీరిద్దరూ 67 పరుగులు జోడించారు. చివర్లో నీలాక్షీ, కౌషని ధాటిగా ఆడి విజయాన్ని పూర్తి చేశారు. పాక్ కెప్టెన్ ఫాతిమా సనా 4 వికెట్లతో పోరాడినా ఫలితం లేకపోయింది. ఆదివారం జరిగే ఫైనల్లో భారత్, శ్రీలంక తలపడనున్నాయి.