హ్యాట్రిక్‌పై ట్రీసా-గాయత్రి జోడీ కన్ను

24-11-2026 | 05:05am

నేటి నుంచే సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ

లక్నో, నవంబర్ 23: ప్రతిష్టాత్మక సయ్యద్ మోదీ(Syed Modi) ఇండియా ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ(International Badminton Tournament) మంగళవారం నుంచి మొదలుకానుంది. లక్నో వేదికగా జరిగే ఈ టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్(BWF World Tour) సీజన్లో చివరిది. స్టార్ ప్లేయర్ పీవీ సింధు(PV Sindhu) ఈ టోర్నీకి దూరమైనప్పటకీ పలువురు యువ షట్లర్లు సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నారు. మహిళల డబుల్స్‌లో డిఫెండింగ్ ఛాంపియన్లు ట్రీసా జాలీ- గాయత్రి గోపీచంద్ జోడీ టాప్ సీడ్‌గా బరిలోకి దిగుతోంది.

2024, 2025లలో విజేతలుగా నిలిచిన వీరు హ్యాట్రిక్ టైటిల్‌పై కన్నేశారు. సింగిల్స్‌లో ఇటీవల హాంకాంగ్ ఓపెన్‌లో ఒలింపిక్ ఛాంపియన్ చెన్ యుఫ్‌కు షాకిచ్చిన 19 ఏళ్ల రక్షిత రామరాజ్‌పై అంచనాలున్నాయి. ఆమెతో పాటు రెండో సీడ్ తన్వీ శర్మ, మూడో సీడ్ ఉన్నతి హుడా, అష్మిత చలిహా కూడా టైటిల్ రేసులో ఉన్నారు. పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ మూడో సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు.

మరిన్ని వార్తలు