సెమీస్‌లో తన్వి, ట్రీసా జోడీ
సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్
లక్నో, నవంబర్ 27: సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ బ్యాడ్మింటన్ టోర్నీ(Syed Modi International Badminton Tournament)లో భారత క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ, ఉన్నతి హుడా సె మీఫైనల్లో అడుగుపెట్టారు. హోరాహోరీగా సాగిన క్వార్టర్ ఫైనల్లో తన్వి శర్మ 21 18 స్కోరుతో ఇండోనేషియాకు చెందిన అమర్త్య ప్రతివిపై విజయం సాధించింది.
తొలి గేమ్ గెలిచిన తన్వికి రెండో గేమ్‌లో చుక్కెదురైంది. అయితే నిర్ణయాత్మక మూడో గేమ్‌లో మాత్రం పూర్తి ఆధిపత్యం కనబరిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. అలాగే ఉన్నతి హుడా కూడా ముందంజ వేసింది. క్వార్టర్ ఫైనల్లో ఉన్నతి 21 15 స్కోరుతో భారత్‌కే చెందిన అన్మోల్ ఖర్బ్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టు తలపడ్డారు. తొలి గేమ్‌లో ఉన్నతి పైచేయి సాధిస్తే తర్వాత పుంజుకున్న అన్మోల్ స్కోరు సమం చేసింది.
అయితే మూడో గేమ్‌లో మాత్రం ఉన్నతి తనదైన ఆటతీరుతో అన్మోల్ జోరుకు బ్రేక్ వేసి సెమీస్‌కు చేరింది. అటు మహిళల డబుల్స్‌లో డిఫెండింగ్ చాంపియన్ ట్రీసా జాలీ,గాయత్రి గోపీచంద్ జోడీ కూడా సెమీఫైనల్‌కు చేరుకుంది. ప్రత్య ర్థి జోడీ గాయంతో తప్పుకోవడంతో భారత జోడీ టైటిల్‌కు రెండడుగుల దూరంలో నిలిచింది. మిక్సిడ్ డబుల్స్‌లో సాత్విక్ రెడ్డి, ఉద యసూరియన్ జోడీ కూడా సెమీస్ చేరింది. అటు పురుషుల సింగిల్స్‌లో తుషార్ సవీర్, మహిళల సింగిల్స్‌లో తస్నిమ్ మీర్ క్వార్టర్ ఫైనల్లో పరాజయం పాలయ్యారు.