యునిసెఫ్ సెలబ్రిటీ సలహాదారుగా స్మృతి
భారత కెప్టెన్‌కు అరుదైన గౌరవం
న్యూయార్క్, అక్టోబర్ 11 : భారత మహిళల జట్టు కొత్త కెప్టెన్ స్మృతి మంధానకు అరుదైన గౌరవం దక్కింది.యునిసెఫ్ ఇండియా(UNICEF India) ఆమెను సెలబ్రిటీ సలహాదారుగా ని యమించింది. అంతర్జాతీయ బాలికా దినోత్సవం(International Girl Child Day ) సందర్భంగా యునిసెఫ్ ఈ ప్రకటన విడుదల చేసింది. బాలికల హక్కులు, భద్ర త, ఆరోగ్యం, సమాన అవకాశాలపై యునిసెఫ్ అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తుం ది.
ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో స్మృతి కీలకపాత్ర పోషించనుంది. బాలికలు చదువుకోవ డంతోపాటు క్రీడల్లో రాణించి, తమ లక్ష్యాలను చేరుకునేలా ప్రోత్సహించేందుకు యు నిసెఫ్ చేపట్టే కార్యక్రమాలకు ఆమె మద్దతుగా నిలవనుంది. యునిసెఫ్‌లో ఇలాంటి బాధ్యతలు లభించడం గౌరవంగా భావిస్తున్నట్టు స్మృతి తెలిపింది. ప్రతి చిన్నారికి పెద్ద కలలు కనడంతోపాటు వాటిని నిజం చేసుకునే అవకాశం ఉండాలని పేర్కొంది.
గతం లోనూ ఆమె బాలికల సమానత్వం, పిల్లల హక్కులపై యునిసెఫ్ నిర్వహించిన ప్రచార కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది. భారత మహిళల క్రికెట్ అభివృద్ధిలో కీలకంగా ఉన్న స్మృతి మంధాన ప్రస్థానం బాలికలకు ఎం తో స్ఫూర్తినిస్తుందని యునిసెఫ్ ఇండి యా ప్రతినిధి సింథియా మెక్కాఫ్రీ వ్యాఖ్యానించారు. ప్రతిభకు సరైన అవకాశాలు తోడైతే అద్భుతాలు సాధించవచ్చని ఆమె విజయాలు నిరూపిస్తున్నాయని పేర్కొన్నారు. కాగా హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్న తర్వాత బీసీసీఐ స్మృతికి సారథ్య బాధ్యతలు అప్పగించింది.