బోరు మోటారు కు మరమ్మతులు
11-10-2026 | 07:10pm
మఠంపల్లి అక్టోబర్ 11(విజయక్రాంతి) : మండలంలోని కృష్ణ తండా గ్రామంలో(Krishna Thanda Village) బోరుకు మరమ్మతులు చేపట్టి నీటి సరఫరాను(Water supply) సర్పంచ్ బానోతు రమాదేవి శంకర్ నాయక్ పునరుద్ధరించారు.బోరు మోటారు నడవడం తో గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేశారు.బోరు మోటార్,కేబుల్ వైర్,పైపులు, స్టార్టర్ బాక్స్ క్రొత్త వాటిని అమర్చడం ద్వారా గ్రామ ప్రజలకు నీటి సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ శంభయ్య,వార్డు సభ్యులు నాగమణిశ్రీను,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.