పంటలు చేతికోచ్చే సమయంలో కరెంట్ కోతలు సరికాదు

08-10-2026 | 07:51pm

సీపీఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు

నేరేడుచర్ల, అక్టోబర్ 08(విజయ క్రాంతి): పంటలు చేతికొచ్చే సమయంలో కరెంటు కోతలు విధించడం సరికాదని సీపీఐ(CPI) రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడుఅన్నారు. గురువారం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల ట్రాన్స్‌కో ఏఈ కార్యాలయం(Nereducherla Transco AE Office) ముందు తీవ్రమైన విద్యుత్ కోతలకు నిరసనగా సీపీఐ, రైతు సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించిన సందర్భంగా అయన మాట్లాడుతూ... వరి కంకులు పాలు పోసుకుంటున్న దశలో ఉన్నాయని, ఇప్పుడు నీరు అందకపోతే పంట తాలుగా మారే ప్రమాదం ఉందన్నారు.

ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోజుకు కనీసం 12 గంటలు విద్యుత్ సరఫరా చేయాలని, అవసరమైతే పరిశ్రమలకు కోత విధించి రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో మండల సీపీఐ కార్యదర్శి కత్తి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రావుల సత్యం, బీసీ హక్కుల సాధన సమితి జిల్లా గౌరవాధ్యక్షుడు చిలకరాజు శ్రీను, ఏఐవైఎఫ్ మండల అధ్యక్షుడు పరికె భరత్, రైతు సంఘం నాయకులు కటికోల వెంకన్న, బెల్లంకొండ గోవిందు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు