దస్రు నాయక్‌ సేవలు మరువలేనివి

02-11-2026 | 11:03pm
  1. రాయికుంట తండా ఆవాస గ్రామం రాందాస్ తండాలో స్వర్గీయ భూక్య దస్రు విగ్రహావిష్కరణ
  2. కాంగ్రెస్‌ నేతల నివాళులు

మోతె, నవంబర్ 02 (విజయ క్రాంతి) : ఇటీవల మరణించిన స్వర్గీయ భూక్య దస్రు నాయక్‌ సేవలు మరువలేనివని మోతె మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కీసర సంతోష్‌ రెడ్డి(Congress Party President Keesara Santhosh Reddy) అన్నారు. సోమవారం మోతె మండలం రాయి కుంట తండా  (రాందాస్‌ తండా)లో ఏర్పాటు చేసిన భూక్య దస్రు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దస్రు నాయక్‌ సేవలను స్మరించుకుంటూ నివాళులర్పించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి ఈదయ్య గౌడ్‌, గ్రామ సర్పంచ్‌ భూక్య ఉప్పయ్య, ఉపసర్పంచ్‌ భూక్య నరేష్‌, వార్డు సభ్యులు భూక్య హుస్సేన్‌, రాములు, శంకర్‌, కాంగ్రెస్‌ నాయకులు మేకల గురు కృష్ణ, మిక్కిలినేని రాము, ధరావత్‌ నాగు, హలవత్ లచ్చు, రవి, భూక్య మధు, టింకు బాబు, వివిధ గ్రామాల సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు