ఉచిత మెగా వైద్య శిబిరం విజయవంతం

10-10-2026 | 07:46pm

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): జాజిరెడ్డిగూడెం గ్రామం(Jajireddygudem Village)లో శనివారం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరం(Free Mega Medical Camp) విజయవంతంగా ముగిసింది. ప్రముఖ కామినేని ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(Kamineni Institute of Medical Sciences) నార్కట్‌పల్లి వారి సౌజన్యంతో, గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.శిబిరంలో జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్, కంటి వైద్య నిపుణుల బృందం గ్రామస్తులకు ఉచితంగా వైద్య సేవలు అందించారు. బీపీ, షుగర్, కంటి పరీక్షలతో పాటు కీళ్ల నొప్పులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ప్రత్యేక పరీక్షలు నిర్వహించారు.

అవసరమైన పేద రోగులకు కామినేని హాస్పిటల్ నందు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తామని వైద్యులు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ బింగి కృష్ణమూర్తి మాట్లాడుతూ గ్రామ ప్రజల ఆరోగ్యం కోసం ఇలాంటి శిబిరాలు ఎంతో అవసరమని,కామినేని యాజమాన్యానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు బొల్లం సైదులు, విజయవెంకటేశ్వర్లు, కుంభం సత్తయ్య,యాదగిరి, సోమయ్య, దొనకొండ, బిక్షం గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు