రైతులకు కనీసం ఆరు గంటలైనా కరెంట్ ఇవ్వాలి

10-10-2026 | 08:55pm

- మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్

గంగాధర,(విజయక్రాంతి): విద్యుత్ కోతలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వేసుకున్న పంటలను కాపాడే క్రమంలో రోజుకు 3500-4000 వెచ్చించి వరి పంటకు నీరు పెడుతున్నారని రైతన్న పడుతున్న కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటినుంచి కనీసం రోజుకు 6 గంటల నాణ్యమైన నిరంతర కరెంటు ను ఇవ్వాలని చొప్పదండి  మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్(Ex-MLA Sunketa Ravishankar) ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. కరీంనగర్ జిల్లా() గంగాధర మండలంలోని గర్షకుర్తి, తాడిజెర్రి గ్రామాలలో ఎండుతున్న వరి పంటలను శనివారం ఆయన బిఆర్ఎస్ పార్టీ నాయకులు, రైతులతో కలిసి పరిశీలించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే  మాట్లాడుతూ... ఈ ప్రాంతంలోని జలాశయాల్లో బావుల్లో సమృద్ధిగా నీరున్న విద్యుత్ కోతలతో ఒక మడి తడిసే లోపే కరెంటు పోయి మళ్లీ ఒక మడికి నీరు అందించే లోపు మళ్ళీ కరెంటు పోతుందని తద్వారా పంటలు ఎండిపోతుండడంతో పంట పండించుకోలేక రైతన్న అత్యంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వరి పంట పొట్ట దశలో ఉన్నదని కేవలం పది రోజులు కరెంటును సక్రమంగా ఇవ్వగలిగితే ఈ పంటలు పండే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎండిపోయిన పంటలను వ్యవసాయ అధికారులచే సర్వే చేయించి ఎకరాన 50,000 రూపాయల నష్టపరిహారం రైతులకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు