కెసిఆర్ హయాంలోనే పల్లెలు పచ్చగా ఉన్నాయి
- హుజూర్ నగర్ నియోజకవర్గంలో భూకబ్జాలు,అవినీతి రాజమేలుతున్నాయి
- ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయం
- మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి
హుజూర్ నగర్, నవంబర్ 2: కెసిఆర్ హయాంలోనే పల్లెలు పచ్చగా ఉన్నాయని నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో(Congress government) నెలలు వాసి ఆకాశం వైపు చూస్తున్నాయని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే గుంతకండ్ల జగదీశ్ రెడ్డి(Former Minister and Suryapet MLA Guntakandla Jagadish Reddy) అన్నారు. సోమవారం పట్టణంలోని లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ నమోదుపై నిర్వహించిన నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు...ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నారు.
రాబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేస్తామన్నారు.నీళ్ల మంత్రిగా ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్ కు నీళ్లు ఇవ్వకుండా ఆంధ్రకు తరలించిన ఘనుడని విమర్శించారు.కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని కృష్ణా నది నీటిని తెలంగాణకు తరలించకుండా చంద్రబాబు నియోజకవర్గానికి తరలించిన ఘనులు కాంగ్రెస్ పాలకులున్నారు.నీళ్లపై అవగాహన లేని మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కాలేశ్వరం ప్రాజెక్టుపై అవాకులు,
చావకుళ్లు మాట్లాడుతున్నారని, కన్నేపల్లి పంపులు ఆన్ చేస్తే నేడు కోదాడ వరకు నీళ్లు పారుతాయని అని తెలిసినా పంపులు ఆన్ చేయకుండా చెరువులు నింపకుండా అన్నదాతలను ఏడిపిస్తున్నారని విమర్శించారు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో అవినీతి దందాలు రాజ్యమేలు తున్నాయన్నారు.కాంగ్రెస్ నాయకులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు తప్ప రైతుల గోసలు పట్టవన్నారు. రైతుల జీవితాలతో పాటు నిరుద్యోగ జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న కాంగ్రెస్ కు రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గుణపాఠం చెబుతామన్నారు.అనంతరం నియోజకవర్గ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడారు.
హుజూర్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులు అధికార బలంతో అవినీతి దందాలు,భూ కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జి కంచర్ల కృష్ణారెడ్డి,ఏనుగుల రాకేష్ రెడ్డి,పిల్లుట్ల రఘు,కొప్పుల సైదిరెడ్డి,దొండపాటి అప్పిరెడ్డి, క్రిష్టిపాటి అంజిరెడ్డి, బెల్లంకొండ అమర్,నగేష్ రాథోడ్,తదితరులు,పాల్గొన్నారు.