ఇందిరమ్మ బీమాతో పేద కుటుంబాలకు భరోసా
ఎమ్మెల్యే మందుల సామేలు
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
తుంగతుర్తి,(విజయక్రాంతి): తెలంగాణలోని ప్రతి నిరుపేద కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ప్రజా ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్(Tungaturthi MLA Mandula Samel) అన్నారు. ‘ప్రతి ఇంటికి ఒక భరోసా’ అనే నినాదంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని(Indiramma Life Insurance Scheme) శనివారం నియోజకవర్గ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శాసనసభ్యులు ప్రారంభించి మాట్లాడారు.
కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ఆపద సంభవించినప్పుడు ఆ కుటుంబం ఆర్థిక ఇబ్బందులకు గురికాకుండా జీవిత బీమా ద్వారా ఆర్థిక భరోసా కల్పించాలనే గొప్ప లక్ష్యంతో ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి కుటుంబానికి భద్రత, భరోసా కల్పించడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. అనంతరం మండలానికి చెందిన 24 మంది లబ్ధిదారులకు 8,7,500 రూపాయల విలువ చేసే చెక్కులను అందజేశారు.
ఈ కార్యక్రమంలో తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రేగటి రవి గౌడ్, గ్రామ సర్పంచ్ మల్లెపాక సాయిబాబా,తహసిల్దార్ దయానందం, ఎంపీడీవో చలపతి, ఎంపీఓ సందీప్, గ్రంధాలయ చైర్మన్ గంగరాజు యాదవ్, జిల్లా ఉపాధ్యక్షుడు దొంగరి గోవర్ధన్, నాయకులు మరగాని వెంకటయ్య, నల్లు రామచంద్రారెడ్డి, పోలేపాక రామచంద్రు, దాసరి శ్రీను యువజన సంఘం నాయకులు పొన్నాల సృజన్, కాసర్ల గణేష్, పెద్దబోయిన అజయ్, మాచర్ల అనిల్, తదితరులు పాల్గొన్నారు.