ఈ తేదీల్లో ప్రత్యేక రైళ్లు

21-11-2026 | 01:48pm

హైదరాబాద్ రైల్వే అలర్ట్.. చర్లపల్లి నుంచి బరౌని, రెక్సాల్‌కు ప్రత్యేక రైళ్లు

హైదరాబాద్: రైళ్లలో ప్రయాణికుల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణికులకు ఇబ్బందులు తగ్గించేందుకు చర్లపల్లి నుంచి బిహార్‌లోని బరౌని, రెక్సాల్ మార్గాల్లో Special Trains నడపనుంది. ఈ మేరకు ఆయా రైళ్ల తేదీలు, Departure టైమింగ్స్‌ను దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో శ్రీధర్ వెల్లడించారు. చర్లపల్లి–బరౌని స్పెషల్ ట్రైన్ (07561/07562) ఈ నెల 23న మధ్యాహ్నం 2 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, 24వ తేదీ తెల్లవారుజామున 1.30 గంటలకు బరౌని చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 25వ తేదీ తెల్లవారుజామున 3 గంటలకు బరౌని నుంచి బయలుదేరి, రెండో రోజు సాయంత్రం 7 గంటలకు చర్లపల్లికి చేరుకోనుంది.

రెక్సాల్–చర్లపల్లి స్పెషల్ ట్రైన్ (05531/05532) ఈ నెల 21న సాయంత్రం 4.55 గంటలకు రెక్సాల్ నుంచి బయలుదేరి, రెండో రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో 23వ తేదీ రాత్రి 10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, రెండో రోజు సాయంత్రం 7 గంటలకు రెక్సాల్ చేరుతుంది. ఇక రెక్సాల్–చర్లపల్లి అన్‌రిజర్వ్‌డ్ స్పెషల్ ట్రైన్ (05529/05530) ఈ నెల 22న సాయంత్రం 4.55 గంటలకు రెక్సాల్ నుంచి బయలుదేరి, రెండో రోజు ఉదయం 10 గంటలకు చర్లపల్లి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 24వ తేదీ రాత్రి 10 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, రెండో రోజు సాయంత్రం 7 గంటలకు రెక్సాల్‌కు చేరుకుంటుంది. ప్రయాణానికి సిద్ధమయ్యే వారు Train Number, తేదీ, సమయాలను ముందుగానే పరిశీలించుకోవడం మంచిది.

మరిన్ని వార్తలు