పాతబస్తీలో డ్రగ్స్ దందా

21-11-2026 | 01:11pm

హైదరాబాద్ పాతబస్తీలో డ్రగ్స్ (Drugs) వినియోగం పోలీసులకు సవాల్‌గా మారుతోంది. ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని సీపీ మహేష్ భగవత్ వెల్లడించారు. డ్రగ్స్‌తో పాటు మొబైల్ ఫోన్ల స్నాచింగ్ (Mobile Snatching) కూడా పాతబస్తీలో ప్రధాన సమస్యలుగా ఉన్నాయని తెలిపారు. పురానీ హవేలీలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీపీ పలు కీలక విషయాలను వెల్లడించారు. పాతబస్తీలో నేరాల పరిస్థితిపై మాట్లాడిన ఆయన.. ఇతర ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ హత్యల సంఖ్య తక్కువగా ఉందని వివరించారు.

అదే సమయంలో రౌడీషీటర్ల కదలికలపై పోలీసుల నిఘా (Police Surveillance) మరింత పెంచినట్లు తెలిపారు. నేరాలకు సంబంధించిన కేసుల్లో సాక్షులకు రక్షణ కల్పిస్తూ, నిందితులకు న్యాయస్థానాల్లో శిక్షలు పడేలా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.పాతబస్తీలో ఎక్కడైనా అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు. వెంటనే 112 నంబర్‌కు లేదా సోషల్ మీడియా (Social Media) వేదికగా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంతో పాటు నేరాల నియంత్రణకు ప్రజల సహకారం ఎంతో అవసరమని పోలీసు అధికారులు స్పష్టం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు