పంచాయతీల పరిస్థితి ఇదేనా?

21-11-2026 | 12:59pm

తెలంగాణ గ్రామ పంచాయతీల ఖర్చుల్లో భారీ తగ్గుదల.. కేటీఆర్‌ సంచలన ఆరోపణలు

హైదరాబాద్: తెలంగాణ పల్లెల అభివృద్ధిపై రాజకీయ రగడ మొదలైంది. కేసీఆర్‌ ప్రభుత్వ హయాంలో గ్రామాలు Development దిశగా అడుగులు వేస్తే.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక నిధుల కొరతతో పంచాయతీలు ఇబ్బందులు పడుతున్నాయని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(BRS Working President KTR) ఆరోపించారు. గ్రామ పంచాయతీల ఖర్చులు భారీగా తగ్గిపోయాయని చెబుతూ రేవంత్‌ రెడ్డి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన ‘Finances of Panchayati Raj Institutions’ నివేదికను కేటీఆర్‌ తన వాదనకు ఆధారంగా ప్రస్తావించారు.

2022-23లో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఒక్కో గ్రామ పంచాయతీ సగటున రూ.16.59 లక్షలు ఖర్చు చేయగా.. 2024-25 నాటికి ఆ మొత్తం రూ.6.24 లక్షలకు పడిపోయిందని వెల్లడించారు. అంటే పంచాయతీల సగటు ఖర్చులో భారీ తగ్గుదల నమోదైందని పేర్కొన్నారు. ప్రజలు చెల్లించే Taxes, ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు గ్రామాల అభివృద్ధికి ఎందుకు ఉపయోగపడటం లేదని కేటీఆర్‌ ప్రశ్నించారు. పల్లెల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి కనిపించడం లేదని, రాష్ట్రంలో జరుగుతున్నది Development కాదని.. విధ్వంసమని విమర్శించారు. అయితే, ఈ గణాంకాలపై ప్రభుత్వం నుంచి వచ్చే వివరణతో పాటు పంచాయతీలకు అందుతున్న నిధులపై పూర్తి వివరాలు కూడా కీలకంగా మారనున్నాయి.

మరిన్ని వార్తలు