న్యాయం కోసం వాటర్ ట్యాంక్ ఎక్కిన బాధితుడు
మణుగూరు, నవంబర్ 21 (విజయ క్రాంతి): భూమి వివాదంలో తనకు న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ సురేష్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. తనకు చెల్లించాల్సిన రూ.2 లక్షలు ఇవ్వకుండా మలిగిరెడ్డి గోపాల్ రెడ్డి భూమిని మరొకరికి విక్రయించి మోసం చేశారని బాధితుడు ఆరోపించాడు. ఈ విషయంపై గతంలో పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు, పోలీసులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలో మరో నలుగురితో కలిసి మణుగూరులోని గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఉన్న మున్సిపల్ వాటర్ ట్యాంక్ ఎక్కి నిరసనకు దిగాడు. దీంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు (Police) వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితుడితో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అధికారుల (Officials) స్పందనతో సురేష్ కిందకు దిగాడు. అనంతరం పోలీసులు అతడిని పోలీస్ స్టేషన్కు (Police Station) తరలించారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.