ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యం

12-09-2026 | 06:34pm

సర్పంచ్ కర్నాటి వెంకన్న 

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ప్రతీ ఇంటికి రక్షిత మంచినీరు అందించడమే లక్ష్యమని సర్పంచ్ కర్నాటి వెంకన్న అన్నారు. శనివారం మండలంలోని రామన్నగూడెం గ్రామ(ramannagudem village) ఎస్టీ కాలనీలో నూతన పైపులైన్ పనుల(New pipeline works)ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ... గ్రామ పంచాయతీ నిధులు సుమారు రూ.లక్ష వ్యయంతో నూతన పైపులైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సుధాకర్, వార్డు సభ్యులు, నాయకులు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు