చిరు వ్యాపారులు రహదారులను ఆక్రమించకుండా వ్యాపారం నిర్వహించుకోవాలి
- రోడ్ల ఆక్రమణల తొలగింపునకు పోలీసులకు చిరు వ్యాపారులు సహకరించాలి
- హుజూర్ నగర్ ఎస్ఐలు చలికంటి నరేష్,హనుమాన్ నాయక్
హుజూర్ నగర్, నవంబర్ 2:దుకాణదారులు(Shopkeepers) తమ వ్యాపార కార్యకలాపాలను రహదారులను ఆక్రమించకుండా నిర్వహించుకోవాలని హుజూర్ నగర్ ఎస్ఐలు చలికంటి నరేష్,హనుమాన్ నాయక్ కోరారు. సోమవారం పట్టణంలో రోడ్డు భద్రత,ట్రాఫిక్ నియంత్రణకు పోలీసులు ఆపరేషన్ రోప్(Operation Rope) కార్యక్రమాన్ని చేపట్టారు.ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తున్న చిరు వ్యాపారులకు అవగాహన కల్పించి మాట్లాడారు...ప్రజలకు, వాహనదారులకు ఇబ్బందులు కలిగించవద్దని పోలీసులు సూచించారు.
రహదారులపై ఆక్రమణలకు పాల్పడితే నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అనంతరం ప్రధాన రహదారులపై దుకాణాల ముందు రోడ్లను ఆక్రమించి ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలు,వస్తువులు, ఇతర ఆక్రమణలను తొలగించే చర్యలు చేపట్టారు.రోడ్లపైకి దుకాణాల సామగ్రిని ఏర్పాటు చేయడం, ఫుట్పాత్లు మరియు రహదారులను ఆక్రమించడం వల్ల వాహనదారులు,
పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో పోలీసులు నూతన ట్రాఫిక్ పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. రహదారులపై ఆక్రమణల కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం కలగడమే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు.పట్టణంలో ట్రాఫిక్ సమస్యల నివారణకు, ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడానికి ఆపరేషన్ రోప్ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు