ప్రజావాణికి స్పందన కరువు

24-11-2026 | 05:15am
  1. మండలస్థాయిలో మొక్కుబడేనా
  2. నాలుగు వారల నుండి ఒక్క దరఖాస్తూ రాని వైనం
  3. ప్రజా సమస్యలపై నిర్లక్ష్య ధోరణి!

పాలకవీడు, నవంబర్ 23: ప్రజలు తమ సమస్యలను నేరుగా అధికారులకు(officials) విన్నవించుకునేందుకు ప్రజావాణి ఒక వేదికగా ఉంది. అయితే పాలకవీడు మండలంలో గత నాలుగు వారాలుగా వరుసగా ఒక్క ఫిర్యాదు(Complaint) కూడా నమోదు కాకపోవడం పలు సందేహాలకు తావిస్తోంది. మండలంలో ప్రజా సమస్యలన్నీ పరిష్కారమయ్యాయా?, లేక ప్రజావాణిలో ఫిర్యాదు చేసినా పరిష్కారం లభించదనే భావనతో ప్రజలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉంటున్నారా? అన్న చర్చ సాగుతోంది.

నాలుగు వారాలుగా ఫిర్యాదులు నిల్..

అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటామని చెబుతున్నప్పటికీ, వరుసగా నాలుగు వారాలుగా ఒక్క ఫిర్యాదు కూడా నమోదు కాకపోవడం చర్చకు దారితీస్తోంది.నిజంగానే సమస్యలు లేకపోవడమే ఇందుకు కారణమా? లేక ప్రజావాణిపై తగిన అవగాహన లేకపోవడం, గతంలో ఇచ్చిన ఫిర్యాదుల పరిష్కారంపై స్పష్టత లేకపోవడం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయా? అన్నది తెలియాల్సి ఉంది.

ప్రజావాణి కార్యక్రమం ప్రజలకు, అధికారులకు మధ్య వారధిగా నిలవాలంటే ఫిర్యాదుల స్వీకరణతో పాటు వాటి పరిష్కారంపై కూడా ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. పాలకవీడు మండలంలో వరుసగా నాలుగు వారాలుగా ఫిర్యాదులు నమోదు కాకపోవడానికి గల కారణాలను అధికారులు పరిశీలించి, ప్రజల్లో ప్రజావాణిపై నమ్మకం పెంచేలా చర్యలు తీసుకుంటారా? అన్నది వేచి చూడాలి.

సమస్యలు అనేకం.. ప్రజలు ఏరీ?

మండలంలోని గ్రామాల్లో సీసీ, బీటీ రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధం, ఇందిరమ్మ ఇళ్లు, వ్యవసాయ భూముల సమస్యలు, విద్య, వైద్యం, విద్యుత్ తదితర సమస్యలు ఉన్నప్పటికీ ప్రజావాణికి ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకాకపోవడం చర్చనీ యాంశంగా మారింది.దీంతో ప్రజావాణి కార్యక్రమం  జరుగుతున్న విషయం గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో తెలియలేదా? ప్రచా రంలోపించిందా? అనే ప్రశ్నలు వినిపిసు న్నాయి.

ప్రతి సోమవారం ప్రజావాణి జరుగుతుందనే విషయాన్ని గ్రామాల్లో విసృ్తతంగా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పిస్తే మరింత మంది తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మండలంలో సమస్యలు పుట్టల్లా ఉన్నా.. ప్రజావాణికి మాత్రం నాలుగు వారల నుండి ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం ఈ కార్యక్రమంపై అధికార యంత్రాంగం మరింత ప్రచారం కల్పించాల్సిన అవసరం కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు