కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు మరువలేనివి

21-09-2026 | 01:29pm

బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు సీతయ్య

వర్ధంతి సందర్బంగా తుంగతుర్తి లో నివాళి అర్పించిన బిఆర్ఎస్ నాయకులు

తుంగతుర్తి(విజయ క్రాంతి): స్వాతంత్ర సమరయోధుడు, క్విట్ ఇండియా ఉద్యమ నాయకులు, తెలంగాణ రాష్ట్ర సాధానకోసం ముందుండి పోరాడిన మహనీయుడు కొండా లక్ష్మణ్ బాపూజీ అని, ఆయన చేసిన సేవలు మరువలేనని మాజీ మండల పార్టీ అధ్యక్షులు తాటికొండ సీతయ్య(Tathikonda Seetayya) అన్నారు. కొండా లక్ష్మణ్ వర్ధంతి సందర్బంగా తుంగతుర్తి పార్టీ కార్యాలయం(Tungaturthi Party Office)లో నివాళి అర్పించి, మాట్లాడుతూ, స్వరాష్ట్ర ఉద్యమకాలంలో తనస్వంత ఇంటినే పార్టీ కార్యాలయం గా ఇచ్చి పోరాటానికి చేయూత నిచ్చిన మహానాయకుడి కృషిని భవిష్యత్ తరాలకు తెలియ చేద్దాం అని అన్నారు.


ఈ కార్యక్రమం లో జిల్లా నాయకులు గుండగాని రాములుగౌడ్ మండల నాయకులు గుండగాని దుర్గయ్య. గోపగాని దుర్గయ్య.పూర్ణ నాయక్ గోపగాని రమేష్.నాగమల్లు . పట్టణ అధ్యక్షులు గోపగాని శ్రీనివాస్.మల్లెపాక రాములు బొంకురి మల్లేష్. బొజ్జ సాయికిరణ్. తూం లింగయ్య. తూంరాములు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు