అంబేద్కర్‌పై అసత్య ప్రచారంపై చర్యలు తీసుకోవాలి

16-09-2026 | 09:57pm

బూర్గంపాడు,(విజయక్రాంతి): భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌(Dr. B.R. Ambedkar)పై దురుద్దేశపూర్వకంగా అసత్య ప్రచారం(False propaganda) చేస్తూ, కల్పిత నాయకుడిగా చిత్రీకరిస్తూ పుస్తకం ప్రచురించిన అమర ప్రసాద్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ బూర్గంపాడు ఎస్‌ఐ మేడా ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు.

జాతీయ మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షుడు పల్లంటి రమేష్‌, కాంగ్రెస్‌ పార్టీ బీ-బ్లాక్‌ మహిళా అధ్యక్షురాలు బర్ల నాగమణి, జాతీయ మాల మహానాడు రాష్ట్ర సీనియర్‌ నాయకుడు కూరపాటి దాస్‌ బుధవారం పోలీసులకు ఫిర్యాదు అందజేశారు. అంబేద్కర్‌ ప్రతిష్ఠను దెబ్బతీసేలా అసత్యాలను ప్రచారం చేయడం ద్వారా ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతోందని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత పుస్తకంలోని అంశాలను పరిశీలించి, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

మరిన్ని వార్తలు