సూర్యుడి కరెంట్.. ఖజానాకు ఆదా!

21-09-2026 | 05:35am
  1. ఐడీఓసీలో ఆరు నెలల్లో రూ.4.67 లక్షల బిల్లు సేవ్.. 
  2. సౌరవిద్యుత్‌తో 32 శాతం తగ్గిన విద్యుత్ వ్యయం  
  3. ఇళ్లపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలి: కలెక్టర్ ఆదర్శ్ సురభి  

వనపర్తి, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): సూర్యుడి నుంచి వచ్చే వెలుగును విద్యుత్గా మార్చుకుంటే ప్రభుత్వ ఖజానాపై విద్యుత్ బిల్లుల(Electricity bills) భారాన్ని గణనీయంగా తగ్గించుకోవచ్చని వనపర్తి ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీస్ కాంప్లెక్స్(Wanaparthy Integrated District Office Complex) (ఐడీఓసీ) నిరూపించింది. ఐడీఓసీలో ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ వ్యవస్థ(Solar power system)తో ఆరు నెలల్లోనే రూ.4,67,903 విద్యుత్ బిల్లు ఆదా అయింది. సౌర విద్యుత్ వినియో గం ప్రారంభించిన తర్వాత ఐడీఓసీ విద్యుత్ వ్యయంలో సుమారు 32 శాతం తగ్గుదల నమోదైంది. తక్కువ ఖర్చుతో విద్యుత్ అవసరాలను తీర్చుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ(Environmental Protection)కు సౌర విద్యుత్ దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు. 

ఆరు నెలల్లోనే రూ.4.67 లక్షల ఆదా 

ఐడీఓసీలో సౌర విద్యుత్ వ్యవస్థ ఏ ర్పాటు చేయడానికి ముందు 2025 జనవరి నుంచి జూన్ వరకు ఆరు నెలల్లో విద్యుత్ బిల్లు రూ.14,53,003గా నమోదైంది. సౌర విద్యుత్ వినియోగం అనంతరం ఆరు నెలల కాలంలో బిల్లు రూ.9,85,100కు తగ్గింది. దీంతో రూ.4,67,903 మేర విద్యుత్ వ్య యం ఆదా అయింది. అంటే సౌర విద్యుత్ వినియోగంతో విద్యుత్ ఖర్చులో దాదాపు మూడో వంతు తగ్గినట్లు లెక్కలు చెబుతున్నా యి.

నెలవారీ బిల్లుల్లోనూ స్పష్టమైన తేడా సౌర విద్యుత్ వినియోగం వల్ల నెలవారీ వి ద్యుత్ బిల్లుల్లోనూ గణనీయమైన మార్పు క నిపించింది. 2025 జనవరిలో రూ.2,11,0 58గా ఉన్న బిల్లు 2026 జనవరిలో రూ.1, 66,157కు తగ్గింది. అలాగే 2025 మార్చిలో రూ.2,39,613గా ఉన్న బిల్లు 2026 మార్చి లో రూ.1,68,342 కు చేరింది. సౌర విద్యుత్ వినియోగాన్ని పెంచడం ద్వారా భవిష్యత్లో వి ద్యుత్ వ్యయాన్ని మరింత తగ్గించుకొవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. 

ప్రజలకు ఉపయోగకరమైన పథకం 

ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పీఎం సూర్య ఘర్‌ముఫ్త్ బిజ్లీ యోజనను అమలు చేస్తోంది. ఈ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. సౌర విద్యుత్ వినియోగం ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గడంతో పాటు సంప్రదాయ విద్యుత్ వనరులపై ఆధారపడటం తగ్గుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ప్రజలు కూడా తమ ఇళ్లపై రూఫ్టాప్ సోలార్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకుని పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ప్రభుత్వ కార్యాలయాలకు మార్గదర్శకం 

ఐడీఓసీలో సౌర విద్యుత్ వినియోగంతో నమోదైన ఆదా ఇతర ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఆదర్శంగా నిలుస్తోంది. కార్యాల యాల విద్యుత్ అవసరాల్లో కొంత భాగాన్ని సౌరశక్తి ద్వారా తీర్చడం వల్ల నెలవారీ బి ల్లులు తగ్గడంతో పాటు దీర్ఘకాలంలో ప్ర భుత్వ ఖజానాపై వ్యయభారం తగ్గే అవకా శం ఉంది. అదే సమయంలో సౌర విద్యుత్ పర్యావరణహితమైనది కావడంతో కాలుష్య నియంత్రణకు కూడా దోహదపడుతుంది. 

ఇళ్లపై సోలార్ ఏర్పాటు చేసుకోవాలి

సౌర విద్యుత్ భవిష్యత్ అవసరాలకు సమర్థవంత మైన పరిష్కారం. ఐడీఓసీలో వచ్చిన ఫలితాలు సౌర విద్యుత్ వల్ల కలిగే ప్రయోజనాలను స్పష్టంగా చూపిస్తున్నాయి. ప్రజలు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇళ్లపై రూఫ్టాప్ సౌర విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేసుకోవాలి.

 కలెక్టర్ ఆదర్శ్ సురభి 

మరిన్ని వార్తలు