అన్నమే పరబ్రహ్మ స్వరూపం
శరన్నవరాత్రి ఉత్సవాల్లో (Sharannavaratri Celebrations) భాగంగా నేడు మూడో రోజు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దుర్గమ్మ అన్నపూర్ణాదేవి అలంకారంలో (Annapurna Devi Alankaram) భక్తులకు దర్శనమివ్వనున్నారు. అన్నపూర్ణాదేవి అలంకారంలో ఉండే అమ్మను దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయాలకు వెళ్తారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రోజుకో అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తూ భక్తులకు అనుగ్రహం అందిస్తున్నారు. అన్నపూర్ణాదేవి అలంకారానికి ఆధ్యాత్మికంగా విశేష ప్రాధాన్యం ఉంది. అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు కలుగుతాయని భక్తులు విశ్వసిస్తారు. మూడో రోజు ఉత్సవాల (Day 3 Festivities) సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించనున్నారు.