ఆర్టీసీ ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం

10-10-2026 | 07:40pm

కార్మికుల విశ్వాసానికి నిదర్శనం: ఎండీ ఇమ్రాన్

ఆలేరు,(విజయక్రాంతి): ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ అనుబంధ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్రస్థాయి గుర్తింపు సంఘంగా విజయం సాధించడం కార్మికుల విజయమని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్(AITUC State Secretary Md. Imran) అన్నారు. ఈ సందర్భంగా భువనగిరి వినాయక చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నాయకులు, కార్యకర్తలు బాణాసంచా కాల్చి, మిఠాయిలు పంచి సంబరాలు నిర్వహించారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం, ఉద్యోగ భద్రత కల్పించడం, పెండింగ్ పీఆర్సీ బకాయిల సాధన కోసం నిరంతరం పోరాడుతామని ఇమ్రాన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్ రెడ్డి, రెహమాన్, పేరబోయిన మహేందర్, సామల శోభన్ బాబు, ఉప్పల శాంతికుమార్, కందుల మధు, ఎండీ నయీమ్, మారుపాక వెంకటేష్, చింటూ, జాను, రమేష్, సాయి, శ్రీకాంత్, గౌతమ్, ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు