దత్తాయిపల్లిలో బీర్ల ఐలయ్య మార్నింగ్ వాక్

06-10-2026 | 04:58pm

ప్రజలతో మమేకమై అభివృద్ధి, సంక్షేమ పథకాలపై క్షేత్రస్థాయి పరిశీలన...

ఆలేరు, అక్టోబర్ 6 (విజయక్రాంతి): ఆలేరు నియోజకవర్గం తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య(MLA Beerla Ilaiah) మార్నింగ్ వాక్ నిర్వహించారు. గ్రామంలో పర్యటిస్తూ ప్రజలను నేరుగా కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, మౌలిక వసతులు, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై ఆరా తీశారు.

ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, లబ్ధిదారుల పరిస్థితి, పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజల మధ్యకు వెళ్లి సమస్యలు తెలుసుకుంటూ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తామని ఐలయ్య తెలిపారు.

మరిన్ని వార్తలు