భక్తిశ్రద్ధలతో కాలభైరవ స్వామికి సింధూర పూజలు
06-10-2026 | 05:36pm
రామారెడ్డి, అక్టోబర్ 06 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ఇసన్నపల్లి(రామారెడ్డి) గ్రామాల మధ్య కొలువైన శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానంలో(Kalabhairava Temple) మంగళవారం ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి విశేష అభిషేకం, సింధూర పూజలు జరిపారు.
ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు నిర్వహించిన భజనలు, కాలభైరవ నామస్మరణతో ఆలయ పరిసరాలు భక్తి పారవశ్యంలో మునిగిపోయాయి. పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో అర్చకులు, దేవస్థాన సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.