5 September, 2026 | 5:18 AM

మొక్కై మొలిచి.. మానై ఆక్రమించి..

05-09-2026 | 04:15am

యాదాద్రి భువనగిరి జిల్లా: హైదరాబాద్, వరంగల్ జాతీయ రహదారి(Hyderabad-Warangal National Highway,) 163 హైవేపై మున్సిపల్ ఆఫీస్(Municipal Office) ప్రక్కన నల్గొండ వెళ్ళు ఫ్లై ఓవర్ బ్రిడ్జ్(Flyover Bridge) గోడలకు అక్కడక్కడ మొక్కలు మొలిచి(Plants sprouting) అవి పెరిగి క్రమంగా చెట్లుగా మారుతున్నాయి. మొక్కదశలోనే తొలగించకపోవడం వల్ల అవి వంతెనకు పగుళ్లు వచ్చేలా చేసి గోడలను దెబ్బతీసే ప్రమాదం ఉంది. కావున అధికారులు వీటిపై దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు. 

మరిన్ని వార్తలు