పోలీస్ అమరవీరులకు నివాళులర్పించిన విప్ బీర్ల ఐలయ్య
యాదగిరిగుట్ట, అక్టోబర్ 21 (విజయక్రాంతి): పోలీస్ అమరవీరుల దినోత్సవం(Police Commemoration Day) సందర్భంగా యాదగిరిగుట్ట(Yadagirigutta) పట్టణంలోని పోలీస్ కార్యాలయాన్ని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య(Government Whip Beerla Ilaiah) సందర్శించారు. ఈ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీస్ అమరవీరులకు(Police martyrs) ఘనంగా నివాళులర్పించి, వారి త్యాగాలను స్మరించుకున్నారు. పోలీస్ అధికారులు, వ్యక్తిగత భద్రతా సిబ్బందిని శాలువాలతో సత్కరించి, వారి సేవలను అభినందించారు.
ఈ సందర్భంగా బీర్ల ఐలయ్య మాట్లాడుతూ... ప్రజల రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణ కోసం పోలీసులు నిరంతరం అంకితభావంతో పనిచేస్తున్నారని,విధి నిర్వహణలో తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ప్రజల భద్రత కోసం పోరాడి అమరులైన పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం అని వారి సేవలు సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమన్నారు. శాంతిభద్రతలను కాపాడుతూ, ప్రజలకు భద్రత కల్పించడంలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమైనదని, వారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తించి గౌరవించాలన్నారు.
ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులకు మనమందరం ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని వారి కుటుంబాలకు సమాజం అండగా నిలవాలిని విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందిని అభినందించడం మన బాధ్యత అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో డి ఎస్ పి శ్రీనివాస్ నాయుడు, సిఐలు శంకర్ గౌడ్, భాస్కర్, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.