వృద్ధాశ్రమంలో అన్నదానం, దుస్తుల పంపిణీ
అచ్చంపేట, నవంబర్ 22 (విజయక్రాంతి): అచ్చంపేటకు(Achampet) చెందిన సిద్ధంశెట్టి నరసమ్మ(Siddhamsetti Narasamma) 5వ వర్ధంతిని పురస్కరించుకుని ఆమె కుమారుడు సిద్ధంశెట్టి కోటీశ్వర్, రాజేశ్వరి దంపతులు అచ్చంపేటలోని వృద్ధాశ్రమంలో(Old Age Home) సేవా కార్యక్రమాలు(Service Activities) నిర్వహించారు. ఐవీఎఫ్ డివిజన్ కమిటీ, జిల్లా కమిటీ, మహిళా కమిటీ ఆధ్వర్యంలో సుమారు 30 మంది వృద్ధులకు అన్నదానం చేసి వస్త్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐవీఎఫ్ డివిజన్ కమిటీ సభ్యులు ఉప్పల పరమేశ్వర్, దాచేపల్లి శ్రీనివాస్, అర్థం వినోద్, బండారు రామచంద్రయ్య, ఇల్లెందుల పరమేశ్వర్, జూలూరి అశోక్ పాల్గొన్నారు. అన్నదానం, వస్త్రదానం అందుకున్న వృద్ధులు సంతోషం వ్యక్తం చేస్తూ దాతలను ఆశీర్వదించారు.