శ్రీరాంపూర్ సన్నిదానం అయ్యప్ప భక్తుల మాలాధారణ
డిసెంబర్ 8న అయ్యప్ప స్వాముల మహా సంగమం పడిపూజా
శ్రీరాంపూర్, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా(Mancherial District) నస్పూర్ మండలం శ్రీరాంపూర్ కాలనీ(Srirampur Colony) అయ్యప్ప సేవా సన్నిదానం అయ్యప్ప భక్తులు(devotees) ఆదివారం అయ్యప్ప స్వామి మాలాధారణ చేశారు. శ్రీరాంపూర్ అఖిల భారతీయ అయ్యప్ప ధర్మప్రచార సభ అధ్యక్షుడు బొడ్డు లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి బాస్కర్ల రాజేశం, వర్కింగ్ ప్రెసిడెంట్ సాదు వీరభద్రస్వామి, ఉపాధ్యక్షుడు వంగ శివల ఆద్వర్యంలో అయ్యప్ప భక్తులు(devotees) గోదావరి పున్యస్నాణం ఆచరించి అయ్యప్ప దేవాలయంలో గురుస్వామి చక్రవర్తుల పురుషోత్తమా చార్యలుచే అయ్యప్ప స్వామి మాల ధరించారు.
అయ్యప్ప భక్తులకు(devotees) దీక్షా నియమాలు ఉపదేశించి నిష్టగా 41 రోజులు అయ్యప్ప స్వామి పూజలు చేసి శభరిమలకు ఇరుముడి దాల్చి వెల్లాలని గురుస్వామి కోరారు. దీక్షలో భక్తులకు(devotees) ఏకాగ్రత, క్రమ శిక్షణ పెరుగుతుందన్నారు. డిసెంబర్ 8న మంగళవారం శ్రీరాంపూర్ కాలనీ ప్రగతీ స్టేడియంలో(Srirampur Colony Pragathi Stadium) కేరళకు(Kerala) చెందిన సంజీవ నంబూద్రి గురుస్వామిచే అయ్యప్ప స్వాముల మహా సంగమం, సామూహిక మహా పడిపూజా నిర్వహించడం జరుగుతుందన్నారు.
అలాగే అయ్యప్ప స్వాములచే అగ్నిగుండాల ప్రవేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమం కోశాధికారి సీహెచ్ సదానందం, సహాయ కార్యదర్శి సీహెచ్ వేణు, కార్యదర్శి కొండాల్రెడ్డి, బోడ రాజేశ్, ప్రసాద్, ఆర్ మదు, ఐలయ్య, పడాల లింగయ్య, చెన్నారెడ్డి, ఆర్గనైజింగ్ కార్యదర్శి జక్కెన రమేష్, సత్యనారాయణ, వంశీ, క్రాంతి, పప్పు, హరీష్, నరిగె నరేష్, మోహన్, బన్నీ, సబ్యులు ఎస్ సతీష్, బోగ రమేష్, దాసరి నవీన్, గందం వెంకటేశ్, ఎగ్గడి వినోద్, అశోక్ పాల్గొన్నారు.