ఐలమ్మ బహుజన ఆత్మ గౌరవానికి ప్రతీక
బోథ్. సెప్టెంబర్ 26 ( విజయక్రాంతి): చాకలి ఐలమ్మ(Chakali Ailamma) తెలంగాణ వీరనారి అని ఆమె బహుజనుల ఆత్మ గౌరవానికి ప్రతీక అని పలువురు పేర్కొన్నారు. శనివారం మండల కేంద్రంలోని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రజక సంఘం నాయకులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేశారు. రజాకార్ల అరాచకాలను ఎదిరించేందుకు ఎర్రజెండా చేతబట్టి పోరాడిన వీర వనిత అని పలువురు పేర్కొన్నారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సురేందర్ యాదవ్ ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ బి ఆర్ ఎస్ యూత్ అధ్యక్షులు మేడిచెల్మా ప్రవీణ్ వార్డు సభ్యులు కట్ట భూమేష్, మాసం వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మెరుగు భోజన్న, నాయకులు అచ్చిదానంద రెడ్డి, మాజీ ఎంపీటీసీ టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కురుమే మహేందర్, సిపిఐ నాయకులు బి గోవర్ధన్, తో పాటు పలువురు రజక సంఘం వారు పాల్గొన్నారు,