ఆపదలో ఆదుకున్న దుద్దిళ్ల కుటుంబం

26-09-2026 | 01:23pm

నిజామాబాద్ కుటుంబానికి రూ.3 లక్షల ఎల్వోసీ మంజూరు

మంథని, సెప్టెంబర్ 26(విజయ క్రాంతి): ఆపదలో ఉన్న కుటుంబానికి అండగా నిలిచి మానవత్వాన్ని చాటుకున్నారు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు(Minister Duddilla Sridhar Babu). నిజామాబాద్‌కు చెందిన ఆంజనేయులు ప్రస్తుతం హైదరాబాద్‌(Hyderabad)లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి అనారోగ్యానికి గురై చికిత్స పొందుతున్న నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులు మంత్రి శ్రీధర్‌బాబు(Minister Sridhar Babu) సహాయం కోసం సంప్రదించారు. ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లగా, నియోజకవర్గానికి సంబంధం లేకపోయినా వెంటనే స్పందించి ఆసుపత్రి వర్గాలతో మాట్లాడి వైద్య చికిత్సకు అవసరమైన చర్యలు చేపట్టారు. అనంతరం రూ.3 లక్షల విలువైన ఎల్వోసీని మంజూరు చేయించి బాధిత కుటుంబానికి అండగా నిలిచారు.

ఆపద సమయంలో తమకు అండగా నిలిచి, నియోజకవర్గ పరిధి కాకపోయినా మానవతా దృక్పథంతో స్పందించిన మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ఆంజనేయులు, ఆయన కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సహాయానికి సహకరించిన దుద్దిళ్ల శ్రీనుబాబు, మహేందర్‌యాదవ్‌లకు కూడా ధన్యవాదాలు తెలిపారు.ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడమే మానవత్వమని మరోసారి చాటిన దుద్దిళ్ల కుటుంబానికి పలువురు అభినందనలు తెలిపారు.

మరిన్ని వార్తలు