ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి
15-09-2026 | 06:20pm
బోథ్,(విజయకాంత్రి): ఈనెల 28 నుండి 30వ తేదీ వరకు హనుమకొండలో జరగనున్న ఏఐఎస్ఎఫ్ 90వ వార్షికోత్సవ(AISF 90th anniversary celebrations) సభను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మున్సిఫ్ పిలుపునిచ్చారు. వార్షికోత్సవానికి సంబంధించిన వాల్ పోస్టర్లను మండల కేంద్రంలో విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... విద్యారంగ సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ పోరాటం చేస్తూ ఎన్నో సమస్యలను పరిష్కరించేందుకు పోరాటాలు చేసిందన్నారు.. వార్షికోత్సవం విజయవంతం చేసేందుకు భారీ ఎత్తున యువకులు తరలిరావాలన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు సంతోష్ ,ముక్రం, సమీర్ ,సాబీర్, తదితరులు పాల్గొన్నారు.