తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా నిర్వహించాలి

15-09-2026 | 06:34pm

బిజెపి మండల అధ్యక్షులు మహేందర్

ములుగు,(విజయక్రాంతి): సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా(Telangana Liberation Day) అధికారికంగా నిర్వహించడంతో పాటు, ప్రభుత్వ ఆధ్వర్యంలో ఘనంగా వేడుకలు నిర్వహించాలని కోరుతూ మల్లంపల్లి డిప్యూటీ ఎం.ఆర్.ఓకు మల్లంపల్లి మండల(Mallampally Mandal) అధ్యక్షులు బైకాని మహేందర్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా బైకాని మహేందర్ మాట్లాడుతూ తెలంగాణ విమోచన దినోత్సవానికి చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. తెలంగాణ కోసం పోరాడిన వీరుల త్యాగాలను స్మరించుకోవడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.

వారి పోరాట స్ఫూర్తిని నేటి తరానికి తెలియజేసే విధంగా సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని అన్నారు. మల్లంపల్లి మండలంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించి, తెలంగాణ చరిత్ర, పోరాటం, త్యాగాలను ప్రజలకు, యువతకు తెలియజేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మల్లంపల్లి మండల ఉపాధ్యక్షులు బండి బాబు,  మండల ప్రధాన కార్యదర్శి ఎండిగా రాజు మండల కార్యదర్శి పోతురాజు సంపత్, బయ్యా రాజేందర్ గుగులోత్ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు