ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల మృతి కలచివేసింది
బాధిత కుటుంబానికి అండగా ఉంటాం: భూక్యా జాన్సన్ నాయక్..
ఉట్నూర్, అక్టోబర్ 18 ( విజయ్క్రాంతి ): ఇంద్రవెల్లి మండలంలోని(Indravelly Mandal) హర్కాపూర్ (తండా)కు చెందిన రాథోడ్ అరవింద్(Rathod Arvind), రాథోడ్ ప్రవీణ్ అనే అన్నదమ్ములు అనుమానాస్పద స్థితిలో బావిలో మృతదేహాలుగా(Dead bodies) కనిపించిన విషయం తెలుసుకున్న ఖానాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ భూక్యా జాన్సన్ నాయక్(Bhukya Johnson Naik) వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు ఇద్దరూ ఇలా మృతి చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని భూక్యా జాన్సన్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర దుఃఖంలో ఉన్న కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అనంతరం బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించారు.
వారి వెంట ఇంద్రవెల్లి మండల BRS పార్టీ సీనియర్ నాయకులు ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు...