ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
గ్రామ గ్రామాన బతుకమ్మ ఆడిన మహిళలు
హాజీపూర్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) హాజీపూర్ మండలంలో ఆది వారం మహిళలు ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలను(Saddula Bathukamma celebrations) జరుపుకున్నారు. రంగురంగుల పూలతో ఏర్పాటు చేసిన బతుకమ్మలను మండల కేంద్రం తో పాటు గ్రామాల్లోని ప్రధాన చౌరస్తాలలో ఏర్పాటు చేసి బతుకమ్మ పాటలను పాడుతూ మహిళలు అలరించారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ వేడుకలలో భాగంగా చివరి రోజున పెద్ద బతుకమ్మ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా మహిళలు రకరకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలను అలంకరించారు, రంగురంగుల పూవులతో బతుకమ్మలను పోటాపోటీగా అలంకరించారు. ఎంతో భక్తిశ్రద్ధలతో(devotional) బతుకమ్మలను పేర్చి గ్రామాల్లోని కూడలిలో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అనంతరం బతకమ్మలను తీసుకొని వెళ్లి సమీప గోదావరి తీరంలో, చెరువులలో, కాలువలలో, ఆలయాల వద్ద ఏర్పాటు చేసిన నీటి గుంతలు, కుంటల్లో బతుకమ్మలను నిమజ్జనం చేసి తమ వెంట తీసుకువెళ్లిన సద్దులను ఒకరికొకరు పంచి పెట్టుకున్నారు.