గోల్కొండ లో ముగిసిన సద్దుల బతుకమ్మ సంబరాలు

18-10-2026 | 08:44pm

బెజ్జూర్ అక్టోబర్ 18 (విజయ క్రాంతి) : బెజ్జూర్ మండల(Bejjur Mandal) కేంద్రంలోని గోల్కొండ కాలనీలో సద్దుల బతుకమ్మ సంబరాలు(Saddula Bathukamma Celebrations) అంబరాన్ని అంటాయి. బిఆర్ఎస్ నాయకులు అమీరుద్దీన్  సద్దుల బతుకమ్మ ఆడే ప్రాంతంలో విద్యుత్ దీపాలు తన సొంత డబ్బులతో ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. కుల మత ఎలాంటి విభేదాలు లేకుండా కాలనీ ప్రజలతో మమేకమై ఉంటామని వారి సౌకర్యార్థం విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయడంతో పాటు, గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ బతుకమ్మ ఆడే ప్రాంతాన్ని పారిశుద్ధ కార్మికులతో శుభ్రం చేయించారు.

ఆడపడుచుల పండగ పై సహకరించినందుకు కాలనీ ప్రజలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. బతుకమ్మ ఆటపాటలతో సద్దుల బతుకమ్మ ప్రజలు ఘనంగా జరుపుకున్నట్లు కాలనీ ప్రజలు తెలిపారు  అనంతరం సమీపంలోని కృష్ణ పల్లి వాగులో బతుకమ్మలను నిమర్జనం చేశారు.

మరిన్ని వార్తలు