వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
- గ్రామ గ్రామాన బతుకమ్మ పండుగ సంబరాలు..
- పోటాపోటీగా బతుకమ్మల అలంకరణ..
వెంకటాపురం నూగూరు అక్టోబర్ 18 (విజయక్రాంతి): వెంకటాపురం మండలంలో సద్దుల బతుకమ్మ(Sadula Bathukamma) పండుగ సంబరాలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చారు. రకరకాల పువ్వులు తీసుకొచ్చి బతుకమ్మలను అలంకరించారు. మండలంలోని రజక బజారులో వేంచేసుకున్న కనకదుర్గ అమ్మవారి ఆవరణంలో బతుకమ్మలు ఆడారు. గ్రామాల్లో పోటాపోటీగా బతుకమ్మలను అలంకరించారు. ఎంతో భక్తిశ్రద్ధలతో బతుకమ్మలను పేర్చి అమ్మవారి ఆవరణంలోని కూడలిలో బతుకమ్మలను ఉంచి బతుకమ్మ పాటలు పాడుతూ ఆటలు ఆడారు. అనంతరం బతకమ్మలను తీసుకొని వెళ్లి గ్రామ సమీపన ఉన్న కంకల వాగులో నిమజ్జనం చేశారు.
అనంతరం అక్కడే తమ వెంట తీసుకువెళ్లిన సద్దులను ప్రసాదాలను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులుకూసం సాంబ శివరావు సోమయ్య సద్ద నపు నరసింహ చారి కల్లూరు సురేష్ కూసం మహేష్ నాగరాజు మహేష్ కొండపర్తి గణేష్ పోలోజు రాజేంద్రప్రసాద్ చంద్రకళ పోలిన శివ రాచకొండ రాము నెహ్రు బెజ్జని సత్తిబాబు గండేపల్లి సతీష్ గుర్రం పుల్లారావు కొండపర్తి సాయి కల్లూరి జాను కొండపర్తి శివకృష్ణ కల్లూరి భాను రాముల రాంబాబు కంటేం ముత్తయ్య కల్లూరి శ్యాము కొండపర్తి సాయి కల్లూరు గణేష్ కొండపర్తి వెంకటేష్ కల్లూరు సర్వెస్ కంటెం రాజశేఖర్ కూసం యశ్వంత్ షేక్ సమీర్ షేక్ హుస్సేన్ కంటేంఅశోక్ దుర్గ .రమణ. రమాదేవి.సమ్మక్కసరస్వతి .పావని .శ్రీలత. వరలక్ష్మి. సుజాత. లక్ష్మి లలిత కుష్బూ వెంకటలక్ష్మి కవిత రమణ పాపా రత్నం నాగలక్ష్మి స్వరూప తిరుపతమ్మ సత్యవత మనీషా .అమూల్య.గౌతమి మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.