10 చలో కలెక్టరేట్ కరపత్రం విడుదల
బెల్లంపల్లి: ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో కరువు ప్రాంతంగా ప్రకటించాలని ఈనెల 10న కలెక్టరేట్(Collectorate) ముందు తలపెట్టిన ధర్నా విజయవంతం చేయాలని సీ పీ ఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్(CPI District Secretary Ramadugu Lakshman), కార్యదర్శి దాగం మల్లేష్, సీనియర్ నేత,జిల్లా కార్యవర్గ సభ్యుడు చిప్ప నరసయ్య పిలుపునిచ్చారు.
బెల్లంపల్లి సీ పీ ఐ కార్యాలయంలో చలో కలెక్టరేట్ కరపత్రాన్నీ విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు. మంచిర్యాల జిల్లాలో ఉన్న అన్ని మండలాలను కరువు ప్రాంతంగా ప్రకటించి, నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. పట్టణ కార్యదర్శి ఆడపు రాజమౌళి, ఎల్ నినో ప్రభావం వలన తీవ్రo గా నీటి ఎద్దడి కారణంగా పంటలు దెబ్బతిని కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. సాగు చేస్తున్న రైతులు, కౌలుదారులు నష్టపోయరని వాపోయారు.
ప్రభుత్వం కరువు ప్రభావిత ప్రాంతంగా గుర్తించి, తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాపారస్తులు సరుకులను బ్లాక్ మార్కెటింగ్ చేస్తూ ధరలు పెంచుతూ ప్రజలను దోపిడీ చేసే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపోయిన రైతులకు నష్టపరిహారం, నిత్యవసర వస్తువుల ధరలను నియంత్రిస్తూ తెల్ల కార్డు లబ్ధిదారుల కందరికి నిత్యవసర వస్తువులు ఉచితంగా సరఫరా చేయాలనికోరారు.
రైతు రుణాలను మాఫీ చేయాలని, పశువులకు మేత తాగునీరు అందించి పసు పోషకులను ఆదుకోవాలని, సాగునీరు తాగునీరు సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలనీ నవంబర్ 10న మంచిర్యాల కలెక్టర్ కార్యాలయం ముందు జరిపే ధర్నాను తలపెట్టామనీ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో సీ పీ ఐ పట్టణ సమితి కార్యదర్శి ఆడపు రాజమౌళి, పట్టణ సహాయ కార్యదర్శి బొల్లం తిలక్ అంబేద్కర్, మండల కార్యదర్శి బొంతల లక్ష్మీనారాయణ, జిల్లా సమితి సభ్యులు రత్నం రాజం, మేకల రాజేశం, నాయకులు కే తిరుపతి, జి మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.